- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ట్ ఎటాక్ తర్వాత కూడా గుండె పూర్తిగా కోలుకుంటుంది..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త అధ్యయనం
హార్ట్ ఎటాక్ తర్వాత కూడా గుండె కండరాల కణాలు సహజంగానే పునరుద్ధరించబడతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇది గుండె జబ్బులపై ఇప్పటి వరకు ఉన్న శాస్త్రీయ అవగాహనను పూర్తిగా మార్చి వేసింది.

దిశ, ఫీచర్స్ : ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత గుండె తనను తాను మరమ్మతు(self-repair) చేసుకోలేదని, కొత్త కండర కణాలు (cardiomyocytes) ఏర్పడవని వైద్యులు నమ్ముతూ వస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఇది కొనసాగుతోంది. కానీ రీసెంట్‌గా యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ (University of Sydney) చేసిన వరల్డ్ ఫస్ట్ అధ్యయనం ఈ భావనను తలకిందులు చేసింది. బైపాస్ సర్జరీ చేయించుకునే రోగల నుంచి జీవించి ఉన్న హృదయ కణజాలాన్ని(living heart tissue) సేకరించి పరిశోధకులు పరిశీలించగా.. గుండెపోటు తర్వాత కూడా హృదయం (heart) కొత్త కండర కణాలను సహజంగా ఉత్పత్తి చేస్తుందని నిరూపించారు. ఈ పరిశోధనా వివరాలు సైన్స్ జర్నల్ ‘సర్క్యులేషన్ రీసెర్చ్’లోనూ పబ్లిష్ అయ్యాయి.
భవిష్యత్తుపై కొత్త ఆశలు..
గుండె కణాలు సహజంగానే పునరుద్ధరించబడతాయనే ఈ అధ్యయనం గుండె జబ్బులపై ఇప్పటి వరకు ఉన్న మన అవగాహనను పూర్తిగా మార్చి వేసింది. హార్ట్ ఎటాక్ తర్వాత గుండె కండరాలపై మచ్చలు(scar tissue) ఏర్పడినప్పటికీ, కొత్త కండర కణాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయనే పరిశోధనా వివరాలు వైద్య రంగ నిపుణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఈ సహజ పునరుత్పత్తి చాలా నెమ్మదిగా జరుగుతోంది. గుండె పూర్తిగా సెల్ఫ్ రిపేర్ చేసుకునేంత స్థాయిలో ఉండటం లేదని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఇది హార్ట్ ఫెయిల్యూర్‌ను పూర్తిగా నివారించలేదు. కానీ భవిష్యత్తులో నివారించే మార్గాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.
గుండెకు స్వయం మరమ్మతు శక్తి
తాజా పరిశోధన భవిష్యత్తులో గుండె జబ్బుల నివారణపై కొత్త ఆశలను చిగురింపజేస్తోందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. శాస్త్రవేత్తలు గుండె కండరాల సహజ పునరుత్పత్తి ప్రక్రియను అర్థం చేసుకుని, దానిని పెంచే (amplify) కొత్త రీజెనరేటివ్ థెరపీలను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమైంది. అంతేకాకుండా ఈ ఆవిష్కరణ ద్వారా హార్ట్ ఎటాక్ తర్వాత కూడా గుండె కండరాలు డ్యామేజ్ కాకుండా.. పూర్తిగా తిరిగి మార్చే మందులు లేదా చికిత్సలు అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. కాగా ప్రస్తుతం ఇది హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్స్‌ను తగ్గించడం, హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడం వైపు ముఖ్యమైన ముందడుగు అంటున్నారు వైద్య నిపుణులు. ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉన్నప్పటికీ, రీజెనరేటివ్ మెడిసిన్ రంగంలో నిజంగానే ఇదొక ప్రధానమైన మైలురాయి. ఓవరాల్‌గా.. సింపుల్‌గా చెప్పాలంటే.. గుండెకు కూడా స్వయం మరమ్మతు(self-repair) చేసుకునే శక్తి ఉంది.






