తెలంగాణ జూనియర్ బాస్కెట్ బాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో బాస్కెట్ బాల్ ప్రీమియర్ లీగ్ (టిజెబిఎల్) కు వేదిక కానుంది.

తెలంగాణ జూనియర్ బాస్కెట్ బాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం
X

దిశ, అల్వాల్: 18 ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో బాస్కెట్ బాల్ ప్రీమియర్ లీగ్ (టిజెబిఎల్) కు వేదిక కానుంది. హైదరాబాద్ యువ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అవకాశాన్ని కల్పించింది. గురువారం 19 నుంచి 28 వరకు యూసఫ్ గుడాలోని కెవిబిఆర్ ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయి.1.48 కోట్లతో 12 టీములను కార్పొరేట్ సంస్థలకు చెందిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం ఫ్రాంచైజీలు, ఫ్లేయర్స్ ఆక్షన్ అట్టహాసంగా జరిగింది. అండర్ 15,18 కేటగిరిలో బాలురు, బాలికలకు చెందిన 12 జట్లు లీగ్ లో పాల్గొంటాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉత్తమైన యువ క్రీడాకారులను ఎంపిక చేశారు.లీగ ట్రయల్స్ లో 3500 మంది క్రీడాకారులు పాల్గొనగా వారి నుంచి 288 మంది ఎంపికయ్యారు.

బాలురు, బాలికల నుంచి ఆరేసి టీములుగా విభజించడం జరిగింది.ఫ్రాంచైజీలు తమ జట్లకు ప్రత్యేక పేర్లు పెట్టారు.హైదరాబాద్, హరికేన్ జట్టును ప్రెస్పరో గ్రూపు రూ.33 లక్షలకు కొనుగోలు చేయగా వికారాబాద్ ప్రెడెక్టర్స్ ను సరితా రెడ్డి గ్రూపు 21.50 లక్షలు, మెదక్ మోన్ స్టర్స్ ను శ్రీనివాస్ వర్మ గ్రూపు 21.50 లక్షలు వరంగల్ స్టాలియన్స్ ను బసాని గ్రూపు 22.50 లక్షలు నల్గొండ నిజాస్ 19,50 లక్షలు, రంగా రెడ్డి రూలర్స్ 30.50 లక్షలకు సాస్టర్ గ్రూపు దక్కించుకుంది ఆయా ఫ్రాంచైజీల విలువ 1,48 కోట్లు కావడం విశేషం టీములకు పెద్ద ఎత్తున స్పాన్సర్ షిప్ లు దక్కడంతో యజమాన్యాలు ఆనందంగా ఉన్నాయి.

పది రోజుల పాటు జరిగే లీగ్ లో యువ క్రీడాకారులు తమ ప్రతిభను కనపరచడానికి మంచి అవకాశం ఉంటుందని తెలంగాణా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృద్వీశర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో బాస్కెట్ బాల్ కు గత కొంత కాలంగా క్రేజ్ పెరుగుతుందని తెలిపారు.ప్రీమియర్ లీగ్ లోని జట్లను కార్పొరెట్ సంస్థలు కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు.లీగ్ లో ఉత్తమ ప్రదర్శన చేసే క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ వేదికలతో పాటుగా జూనియర్ ఎన్ బిఎలో అవకాశాలు ఉంటాయని తెలిపారు.

Next Story