త్వరలోనే ముగింపు.. కూటమి పాలనపై మాజీ సీఎం జగన్ నిప్పులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-18 11:15:19  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయడు దుర్మార్గపు పాలన చేస్తున్నారని, త్వరలోనే ముగింపు ఉంటుందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ...

త్వరలోనే ముగింపు.. కూటమి పాలనపై మాజీ సీఎం జగన్ నిప్పులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయడు (Cm Chandrababu Naidu)దుర్మార్గపు పాలన చేస్తున్నారని, త్వరలోనే ముగింపు ఉంటుందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jaganmohan Reddy) అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాతోందన్నారు. ప్రశ్నించేవారిపై దొంగ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని మండిడపడ్డారు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలని బాధితులకు అండగా నిలవాలని పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించద్దని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. 99 శాతం హామీలు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నా హయాంలో సంక్షేమ కేలండర్ అమలు చేశాం విద్యా, వైద్యం, వ్యవసాయంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 3 లక్షల మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశాం. 17 మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీలు తీసుకొచ్చాం.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Next Story