- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో 3 రోజుల్లో నీట్ రీ ఎగ్జామ్.. విద్యార్థులకు NTA బిగ్ మెసేజ్
నీట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఎన్‌టీఏ విద్యార్థులకు కీలక సందేశం పంపింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నీట్ (NEET) రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 3 రోజుల్లో పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు అత్యంత కీలకమైన సందేశాన్ని పంపింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్ష వాయిదా పడబోతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, సర్క్యులర్లు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై ఎన్‌టీఏ తీవ్రంగా స్పందించింది. పరీక్ష వాయిదా పడుతుందన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. విద్యార్థులు ఇలాంటి ఫేక్ న్యూస్‌ను చూసి ఆందోళన చెందవద్దని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టం చేసింది.
అధికారిక సమాచారాన్నే నమ్మండి..
పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, రూల్స్, ఏవైనా మార్పులు ఉంటే కేవలం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్, అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే తెలియజేస్తామని సంస్థ పేర్కొంది. విద్యార్థులు అనధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోస్టులను నమ్మి గందరగోళానికి గురికావద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని మరోసారి సూచించింది.






