- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గజ్ర’తో మరాఠీలో అడుగుపెట్టనున్న అదా శర్మ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భారీ హైప్
‘ది కేరళ స్టోరీ’తో సంచలనం సృష్టించిన యంగ్ బ్యూటీ అదా శర్మ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తుంది.

దిశ, సినిమా: ‘ది కేరళ స్టోరీ’తో సంచలనం సృష్టించిన యంగ్ బ్యూటీ అదా శర్మ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తుంది. ఢిపరెంట్ కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ప్లేస్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. తాజాగా మరాఠీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా అదా శర్మ మరాఠీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న వస్తున్న వార్తలను నిజం చేస్తూ మొదటి చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఈ మేరకు ‘గజ్ర’ చిత్రంతో మరాఠీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నట్లు తెలుపుతూ.. ‘'గజ్ర'తో మరాఠీలో నా మొదటి అడుగు ప్రారంభమైంది... మీ అందరి ప్రేమ, ఆశీస్సులు నాకు కావాలి!’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో పెళ్లి కూతురు గెటప్‌లో కనిపిస్తూ ముఖం అంతా రక్తంతో భయంకరంగా చూస్తూ మెస్మరైజ్ చేస్తుంది. కాగా.. శ్రేయస్ జాదవ్ దర్శకత్వంలో అమోల్ బోర్కర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే ఒక గాఢమైన, కలవరపెట్టే భయంకరమైన కథాంశాన్ని కలిగి ఉంటుందని చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌తో హింట్ ఇచ్చారు. గణరాజ్ స్టూడియోస్ సమర్పణలో జిగ్ జాగ్ ప్రొడక్షన్స్ వారి తొలి నిర్మాణ ప్రయత్నంగా వస్తున్న గజ్ర.. 2027లో విడుదల కానుంది.






