పేరుకే రాతలు.. పని మాత్రం శూన్యం..

by Bhanu |

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడింది. వైద్యులతో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం మానేశారు.

పేరుకే రాతలు.. పని మాత్రం శూన్యం..
X

దిశ, బీబీపేట: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొరవడింది. వైద్యులతో పాటు సిబ్బంది కూడా సమయపాలన పాటించడం మానేశారు. పట్టణ వాసానికి అలవాటు పడ్డ ఉద్యోగులు బాధ్యత ను విస్మరించారు. ఫలితంగా ప్రభుత్వ వైద్యం పై ఆధారపడ్డ పేదలు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ల్యాబ్ తెరిచింది లేదు. పరీక్షలు చేసింది లేదు. ఎర్ర సూది మందు, మందు బిళ్లల తోనే సరిపెడుతున్నారు. ఇక పరిసరాల పరిశుభ్రత పై వేరే చెప్పనవసరంలేదు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి దీనికి నిదర్శనం.

వైద్య ఆరోగ్య సేవలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా సాగాలి. ఆదివారం మరియు సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపీ ని చూడాలి. కానీ 10 నుంచి 10.30 తర్వాతనే బీబీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరవుతారు. మండలాల్లో నిరుపేదలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందించాలనే దృక్పథం ఆ శాఖలో పూర్తిగా కొరవడింది. శాఖలో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. ఆయా రాం గయా రాం అన్న చందంగా తయారైంది. పట్టణ వాసానికి అలవాటు పడి స్థానికంగా ఉండడం ఎప్పుడో మానేశారు. బదిలీ అయినా ఉద్యోగుల పేర్లను మార్చక పోవడం లో వారి విధి నిర్వహణ లోపం కనిపిస్తుంది. పీహెచ్ సీ నిర్వహణ పై వివరణ కోరిన విలేకరుల కు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు వైద్యాధికారి. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా నీటి వసతి, పరిశుభ్రత రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన, సమయపాలన వంటి వాటిపై తక్షణ చర్యలు చేట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story