- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ యువతకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ శిక్షణ
దిశ, కామారెడ్డి : ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శిక్షణ

దిశ, కామారెడ్డి : ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శిక్షణ ఇస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర రావు పేర్కొన్నారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ను ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, తగినంత చదువు, నైపుణ్యం లేక చాలామంది ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. అలాంటి వారి కోసం రెసిడెన్షియల్ ఒకేషనల్ స్కిల్ లో శిక్షణ ఇవ్వడానికి ఈ కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఫౌండేషన్ లో విద్యార్థులకు ప్రత్యేక వసతి సౌకర్యంతో పాటు శిక్షణ సమయంలో భోజనం సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం గుర్తింపు పొందిన సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా ఉద్యోగం ఇప్పించుటలో మద్దతు తెలపడం జరుగుతుందని పేర్కొన్నారు.






