పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, నవీపేట్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీర్

పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, నవీపేట్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మేడ్చల్ సూర్య శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన మేడ్చల్ సూర్య (19) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం కూడా కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చిన సూర్య హాస్టల్ రూమ్ లో ఎవరూ లేని సమయంలో రూమ్ లో గల ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన రూమ్ మేట్స్ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న నవీపేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

Next Story