స్థానిక సంగ్రామం.. ఎవరి ధీమా వారిది!

by Ajay Maddhiboyina |

ఊరిస్తూ వచ్చిన పంచాయతీ ఎన్నికల సమరం ఎట్టకేలకు మొదలైంది. ఓటర్లలో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి

స్థానిక సంగ్రామం.. ఎవరి ధీమా వారిది!
X

ఊరిస్తూ వచ్చిన పంచాయతీ ఎన్నికల సమరం ఎట్టకేలకు మొదలైంది. ఓటర్లలో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలో మూడు విడుతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అనేక చోట్ల సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతామని హామీలు ఇస్తున్నారు. అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టి స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కొనసాగుతుండడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఆశావహులు తమకు తోచిన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏకగ్రీవాల కోసం గ్రామాల్లో జరుగుతున్న చర్చలపై పోలీసులు నిఘా ఉంచారు. అనేకచోట్ల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. వార్డు సభ్యులను కూడా ప్యానల్‌గా మార్చుకొని ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో సందడిగా మారింది. వారం రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు.

దిశ, భిక్కనూరు : మార్పు కోరి కొత్తవారికి అవకాశం కల్పిస్తారా...? లేక ఇదివరకు సర్పంచ్ గా పనిచేసిన అనుభవాన్ని కోలమానంగా తీసుకొని ఓట్లు వేస్తారా అన్న విషయం తెలియదు కాని మొత్తానికి ఈసారి జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్పంచ్ పదవికి అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు కూడా అంతగా కనిపించని పోరు, రెండు రోజులుగా జరుగుతున్న డోర్ టు డోర్ ప్రచారంతో ఒక్కసారిగా పట్టణంలో హైపు తెచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న మాజీ ఎంపీపీ అధ్యక్షురాలు బల్యాల రేఖ సుదర్శన్, మాజీ సర్పంచ్ పెద్ద బచ్చ గారి నరసింహారెడ్డి సతీమణి సరిత, బీజేపీ నుంచి బండి చంద్రకళా రాములు, వ్యాపారవేత్త సతీమణి బొందుగుల ప్రవళ్లిక, బీ ఆర్ఎస్ నుంచి తాజా మాజీ సర్పంచ్ తునికి వేణు సతీమణి ప్రత్యూష, అదే పార్టీకి చెందిన సొసైటీ డైరెక్టర్ అందె జయమ్మ, ఎన్ ఆర్ ఐ పెద్ద బచ్చగారి శ్రీధర్ రెడ్డి సతీమణి మైత్రేయి లు మంది మార్బలం, తమకు వచ్చిన గుర్తులను చూపిస్తూ డోర్ టు డోర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరే కాకుండా షబానా బేగం ఆమె పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్న దుడుపుల నాగమణి సైతం ప్రచారాన్ని ఉధృతం చేసింది. అయితే కాంగ్రెస్, బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నిక ను ఛాలెంజ్ గా తీసుకున్నాయి.

కొత్తవారిక... లేక పాతవారికి మళ్లీ ఛాన్స్ ఇస్తారా...?

ఈసారి సర్పంచ్ స్థానానికి గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో కొత్త మొహాలకు అవకాశం కల్పిస్తారా...? లేక ఇదివరకు పదవులు అనుభవించిన పాతవారికి అవకాశం కల్పిస్తారా అన్నది అంతుచిక్కడం లేదు. ఇండ్లల్లకు ఎవరు వచ్చి ఓట్లు అడిగినా... కాదనకుండా అబ్బే మా ఓట్లు మీకే అంటూ భరోసా ని చ్చి పంపిస్తున్నారు. బరిలో ఉన్న 9మందికి అదే రకమైన సమాధానం చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు పలాన అభ్యర్థి భర్త, ఆయన టర్ములో బాగా పనులు చేశాడని, అతనికే మా ఓట్లు వేస్తామని కొందరు ఓటర్లు ఓపెన్ అవుతుండగా, ఇంకొందరు మాత్రం ఇంకా మూడు నాలుగు రోజుల సమయం ఉంది కదా అప్పటివరకు చూద్దామంటూ దాట వేస్తుండగా, మా కులం ఓట్లన్ని మా కులం వాళ్లకు వేసుకుంటామని మరికొందరు చెబుతున్నారు. ఈ విధంగా ఎవరికివారుగా కులం బలగాన్ని చూసి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎక్కువగా ఓట్లు ఎటుపడితే, వారే సర్పంచ్ లు గా గెలుస్తారన్న మరో ప్రచారం జరుగుతోంది. ఆ సామాజిక వర్గం నుంచి కూడా తమకంటే తమకు అధికంగా ఓట్లు వస్తాయన్న ధీమాతో మరికొందరు అభ్యర్థులు ఉన్నారు.

ఊహించని అభ్యర్థి గెలవచ్చు...

కొద్దిపాటి ఓట్లతో నేనంటే నేను గెటాన్ అవుతానన్న నమ్మకంతో కొందరు అభ్యర్థులు ఉన్నారు. అయితే ఊహించని అభ్యర్థి సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థినిలు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, మున్నూరు, వైశ్య, ముస్లిం, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. 9,187 ఓట్లు ఉన్న భిక్కనూరులో ఓట్లు చీలిపోయి, ఎవరు ఊహించని అభ్యర్థి సర్పంచ్ పదవిని తన్నుకుపోవడం ఖాయం గా మరో వాదన వినిపిస్తోంది.

Next Story