- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. మంగళవారం కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.

దిశ, కామారెడ్డి రూరల్ : దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉగ్రవాయి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. మంగళవారం కామారెడ్డి ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన శివ శంకర్ మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అయితే ఈనెల 3న శివశంకర్ అత్యంత కిరాతకంగా హత మార్చారు. హత మార్చిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్ గౌడ్ అదే గ్రామానికి చెందిన తోగరి భాగ్యలక్ష్మీ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో మేస్త్రీగా పని చేసే శివశంకర్ కూడా భాగ్యలక్ష్మీతో క్లోజ్ గా ఉండటం గమనించిన శ్రీనివాస్ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా శివశంకర్ ని చంపాలని పతకం పన్నాడు. ఈనెల 02న నిందితులు శ్రీనివాస్ గౌడ్, భాగ్యలక్ష్మీ శివశంకర్ మద్యం సేవించేందుకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లారు. ఉగ్రవాయి గ్రామ శివారులోని రాఘవేంద్ర రైస్ మిల్లు సమీప ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో కడుపులో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కనే పడేసి పరారయ్యారు.
ఈనెల 3న రాఘవేంద్ర రైస్ మిల్లు సమీపంలో రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు గ్రామ పాలన అధికారి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కేవలం 96 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో వేటాడి పట్టుకున్నారని తెలిపారు ఏఎస్పీ చైతన్యరెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసును చాకచక్యం ఛేదించిన విచారణ అధికారి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్సై రంజిత్, దేవుని పల్లి పోలీస్ కానిస్టేబుల్స్ రవికిరణ్, రామస్వామి, రాములును ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్టు ఏఎస్పీ వెల్లడించారు.






