- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లూరు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశంలో పేకాట స్థావరం పై ఎస్ఐ శివకుమార్ దాడి చేశారు. ఈ

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మల్లూరు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశంలో పేకాట స్థావరం పై ఎస్ఐ శివకుమార్ దాడి చేశారు. ఈ సందర్భంగా రూ"21,680/-రూపాయల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పేకాట ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మల్లూరు గ్రామ శివారులో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శివకుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేయగా 5 గురు వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.21,680/- నగదు 3మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ...యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు. వీటి ద్వారా ఆర్థికంగా నష్ట పోతారన్నారు. అంతేగాకుండా కేసులు నమోదయితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పేకాట, ఆన్ లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.






