- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సయ్యద్ ఆసిఫ్ ను పరామర్శించిన పోలీస్ కమిషనర్
దిశ, నిజామాబాద్ అర్బన్ : సీసీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ ఆసిఫ్ ను శుక్రవారం పోలీస్

దిశ, నిజామాబాద్ అర్బన్ : సీసీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన రియాజ్ ను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ ఆసిఫ్ ను శుక్రవారం పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య పరామర్శించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాక ఇంటికి తిరిగొచ్చిన ఆసిఫ్ ను శుక్రవారం పి. సాయిచైతన్య నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఆసిఫ్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆసిఫ్ ను ధైర్యంగా ఉండాలని, ఆయన భవిష్యత్ గురించి భరోసా కల్పించారు.
తుమ్హారా పప్పా బహద్దూర్ హై..
ఆసిఫ్ కొడుకు ఆయాన్ ను సీపీ ఎత్తుకుని కిస్ చేశారు. వారి తండ్రి ఆసిఫ్ గురించి మాట్లాడుతూ తుమ్హారా పప్పా బహద్దూర్ హై అంటూ కొనియాడారు. ఆసిఫ్ కొడుకును ఎత్తుకుని ఆయన తండ్రి ధైర్యసాహసాలను గురించి సీపీ పొగుడుతుంటే అతని కుటుంబ సభ్యులంతా సంతోషించారు. సీపీతో పాటు నిజామాబాద్ ఏసీపీ ఎల్. రాజావెంకట్ రెడ్డి, నిజామాబాదు సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రూరల్ ఎస్ఐ ఎం. డి. ఆరిఫ్, సిక్స్త్ టౌన్ ఎస్.ఐ వెంకట్రావ్ ఉన్నారు.






