షేక్ రియాజ్ పై రూ.50 వేల క్యాష్ రివార్డు : పోలీస్ క‌మిష‌న‌ర్ సాయి చైత‌న్య

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్యచేసి పరారైన నిందితుడు షేక్ రియాజ్ (24) కు సంబంధించిన సమాచారం తెలిపిన

షేక్ రియాజ్ పై రూ.50 వేల క్యాష్ రివార్డు : పోలీస్ క‌మిష‌న‌ర్ సాయి చైత‌న్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్యచేసి పరారైన నిందితుడు షేక్ రియాజ్ (24) కు సంబంధించిన సమాచారం తెలిపిన వారికి జిల్లా పోలీస్ శాఖ రూ.50 వేల క్యాష్ రివార్డును ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య మీడియా సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలోని అహ్మద్ పుర కాలనీకి చెందిన షేక్ రియాజ్ దొంగతనం, దోపిడీ, హత్యానేరాలలో నిందితుడ‌ని తెలిపారు. తాజాగా సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా కత్తితో పొడిచి హత్యచేసి పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుడు షేక్ రియాజ్ ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో ఈ దారుణం జరిగిందన్నారు. పబ్లిక్ గా ఓ పోలీస్ కానిస్టేబుల్ కత్తి పోట్లకు గురై రక్తమోడుతూ బాధపడుతుంటే సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం చాలా విచారకరమన్నారు. హెల్ప్ చేయాలని స్థానికులను సాయమడిగినా ఎవరూ స్పందించకుండా ఉండటాన్ని చూస్తే సమాజం ఎటు వైపు వెళుతుందో అర్థం కావడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోలీసు శాఖ నేరాలను అరికడుతూ, నేరస్థులను పట్టుకునే క్రమంలోనే పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడన్నారు. అలాంటి సమయంలోనే కూడా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. రక్తమోడుతూ ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోను సాయమడిగినా ఆటోవాలా కూడా స్పందించకపోవడం దారుణమని వాపోయారు.

రియాజ్ ను పట్టుకునేందుకు 8 బృందాల ఏర్పాటు

సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్యచేసిన నిందితుడు షేక్ రియాజ్ ను పట్టుకునేందుకు పోలీస్ శాఖ సీరియస్ గా ప్రయత్నిస్తోందని, ఇప్పటికే 8 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఎక్కడున్న వెతికి పట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. జరిగిన సంఘటనతో జిల్లా పోలీసు శాఖ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినట్లు బాధ పడుతున్నామన్నారు. అందరూ తమకు ఎమోషనల్ గా సపోర్ట్ గా ఉండాలని కోరారు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక్కడే వెళ్లాడన్నది నిజం కాదని, ఆయన వెంట ఎస్ఐ కూడా ఉన్నారన్నారు. తమ సీసీఎస్ టీం మెంబర్స్ వద్ద వెపన్స్ ఉన్నాయని, ఆ సమయంలో ఆయన వద్ద వెపన్ లేదని సీపీ అన్నారు. సీసీఎస్ పోలీసుల వద్ద వెపన్స్ లేవనే నిరాధారమైన, ఊహాజనిత వార్తలను దయచేసి స్ప్రెడ్ చేయొద్దని సీపీ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Next Story