- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
దిశ, కమ్మర్ పల్లి : స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్నిరకాల ముందస్తూ ఏర్పాట్లను చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

దిశ, కమ్మర్ పల్లి : స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావలసిన అన్నిరకాల ముందస్తూ ఏర్పాట్లను చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిదిలో గల పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఉండాల్సిన కనీస వసతుల గురించి సమాచారం అందించాలన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల బ్యానర్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు. PS పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు.






