ఈద్గాలు, మసీదులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

by Naveena |

నిజామాబాద్ డివిజన్ లోని ఈద్గాలు, మసీదులను సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం సందర్శించారు.

ఈద్గాలు, మసీదులను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి30: నిజామాబాద్ డివిజన్ లోని ఈద్గాలు, మసీదులను సీపీ పోతరాజు సాయిచైతన్య ఆదివారం సందర్శించారు. ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గాను సందర్శించి అక్కడి పెద్ద మనుషులతో మాట్లాడారు. ఈద్గాలు, మసీద్ లన్నింటినీ తిరిగి పరిశీలించారు. రంజాన్ సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసు ఆఫీసర్ లకు బందోబస్తు విషయంలో పలు సూచనలు చేశారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో దాదాసే450 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తునేర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేశారు. పటిష్టమైన నిఘా వ్యవస్థనేర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా నగరంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన ప్రాంతాలతో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సీపీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ప్రజలు బందోబస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ వారికి సహకరించాలన్నారు. సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐపీ, ఎస్ ఐ లు, ఈద్గా పెద్దలు అబ్దుల్ రెహ్మాన్, ప్రెసిడెంట్ , రఫీక్ బాయ్ , హైసన్ పాషా, వాషిమ్ భాయ్ తదితర కమిటీ మెంబర్లు ఉన్నారు.

Next Story