- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రాహ్మణపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది.

దిశ, తాడ్వాయి : గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. తాడ్వాయి ఇన్ చార్జి ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనీఖీల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ,3,130 నగదుతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పేకాట వంటి జూదాలు ఆడటం, ఆన్‌లైన్ గేమింగ్‌కు పాల్పడటం, మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని ఇన్ చార్జి ఎస్సై స్రవంతి హెచ్చరించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.






