- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోచారం ప్రాజెక్టు బుంగ పూడ్చివేత
పోచారం ప్రాజెక్టు బుంగ పూడ్చివేశారు. మండలంలోని పోచారం ప్రాజెక్ట్ ప్రధాన వరద గేట్ల ప్రక్కన కట్టపై ఏర్పడిన బుంగకు

దిశ, నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు బుంగ పూడ్చివేశారు. మండలంలోని పోచారం ప్రాజెక్ట్ ప్రధాన వరద గేట్ల ప్రక్కన కట్టపై ఏర్పడిన బుంగకు అధికారులు గురువారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోచారం ప్రాజెక్టు లోకి ఒక లక్ష 85 వేల క్యూసెక్కుల మేర భారీగా వరద నీరు వచ్చింది. దింతో ప్రాజెక్టు ప్రధాన కట్టపై నుంచి నీళ్లు పొంగిపొర్లడంతో ప్రధాన గేట్ల పక్కన కట్టకు బుంగపడి భారీగా గండి పడింది. దీంతో ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి వెళ్లడంతో మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ప్రాజెక్టు వద్ద బుంగ పడిన గండికి ట్రాక్టర్లు, జెసిబీల ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.






