- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతి అబార్షన్ ఘటనలో ఆర్ఎంపీ హస్తం
దిశ, కామారెడ్డి : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతికి అబార్షన్ చేసిన ఘటనలో ఓ పీఎంపీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి లోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుట్టు చప్పుడు

దిశ, కామారెడ్డి : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతికి అబార్షన్ చేసిన ఘటనలో ఓ ఆర్ఎంపీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి లోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ యువతికి అబార్షన్ చేసిన విషయం విధితమే. తాడ్వాయి మండలంలోని ఓ యువతికి ఆమె గ్రామం పక్కనే ఉన్న మరొక గ్రామ ఆర్ఎంపీ వైద్యుడు సలహా ఇవ్వడంతోనే ఆ యువతి కామారెడ్డి పట్టణంలోని స్కానింగ్ సెంటర్ కు, అక్కడి నుంచి మల్టీ స్పెషాలిటి ఆస్పత్రికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో యువతి గర్భానికి కారణమైన యువకునిపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేసిన తర్వాత సదరు పీఎంపీ వైద్యున్ని సైతం పోలీస్ స్టేషన్ కు మూడు సార్లు విచారణకు పిలిచినట్టుగా సమాచారం. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ఆర్థికంగా నిలదొక్కుకున్న సదరు ఆర్ఎంపీ వైద్యుడు స్థానికంగా తనకు తెలిసిన రాజకీయ నాయకుల చెంతకు చేరినట్టుగా తెలిసింది. సదరు నాయకులు ముఖ్య నేతలకు సమాచారమిచ్చి ఆర్ఎంపి వైద్యునిపై కేసు కాకుండా వదిలేసేలా చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది. పీఎంపీ వైద్యునిపై కేసు కాకుండా ఉండేందుకు అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
కమీషన్ విషయంలోనే గొడవ
ఈ ఘటనలో సదరు యువతిని స్కానింగ్ కోసం కామారెడ్డి పట్టణంలోని ఓ స్కానింగ్ సెంటర్ కు పీఎంపీ వైద్యుడు పంపించాడు. సదరు స్కానింగ్ సెంటర్ కు ఏ కేసు పంపించినా అందులో ఆర్ఎంపీ వైద్యునికి కమిషన్ ఉంటుంది. అయితే ఈ కేసులో సదరు వైద్యునికి రావాల్సిన కమీషన్ డబ్బును బాధితుల వద్ద తక్కువ తీసుకుని పీఎంపీ వైద్యునికి ఇవ్వకపోవడం వల్ల స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు, ఆర్ఎంపీ కి మధ్య కమిషన్ విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే లింగ నిర్దారణ, ఆ తర్వాత అబార్షన్ కావాల్సిన కేసులకు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏకంగా రూ.40 వేలు ఛార్జ్ చేస్తారని, అందులో ఈ పిఎంపి వైద్యునికి రూ.18 వేలు కమిషన్ ఇస్తారని సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయన్న ప్రచారం సాగుతొంది. అయితే ఈ కేసులో రాజకీయ నాయకుల తీవ్ర ఒత్తిడితో సదరు పీఎంపీ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అయితే అబార్షన్ ఘటనలో అనుకున్నంత విచారణ మాత్రం సాగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓ వైపు సదరు ఆస్పత్రి మేనేజ్మెంట్ తమపై కేసు కాకుండా పెద్ద ఎత్తున పైరవీలు చేయడం, పీఎంపీ వైద్యుని తరపున పొలిటికల్ ఎంట్రీతో కేసు నీరుగారుతోందన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగితే తప్ప అసలు దోషులు బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది.






