- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో జీవించాలి
సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.

దిశ, నిజాంసాగర్ : సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో కలిసి జీవించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ఐక్యత, సహనం, సేవా భావాలను గుర్తు చేసే పవిత్రమైన కాలమని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ అని తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రోత్సాహం అందిస్తోందన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజన వసతులతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మత సామరస్యానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రంజాన్ పండగ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, ఇఫ్తార్ విందు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన గౌరవం ఇస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ముజాహిద్, సందాని, నాయకులు ప్రేమ్ సెట్, అసద్ అలీ, గౌస్ మహమ్మద్, సాహిల్ షెట్కర్, షేక్ అద్నాన్, మున్సిపల్ కమిషనర్ హయ్యూమ్, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.






