పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దులైన బంగారం, వెండి

by Ratna Kumari |

సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామం హనుమాన్ దేవాలయం సమీపంలో నివసిస్తున్న సున్నపు రాజు ఇంటిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

పెంకుటిల్లు దగ్ధం.. కాలి ముద్దులైన బంగారం, వెండి
X

దిశ, సదాశివ నగర్ : సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామం హనుమాన్ దేవాలయం సమీపంలో నివసిస్తున్న సున్నపు రాజు ఇంటిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సున్నపు రాజు భార్య లలిత అంగన్ వాడి కార్యకర్తగా పని చేస్తూ విధుల్లో ఉండగా.. ఇంట్లో వారి కుమారుడు అరవింద్ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 6 తులాల బంగారం ,30 తులాల వెండి,15 వేల రూపాయల నగదు, బియ్యం,టీవీ వంట సామాగ్రి పూర్తిగా ఖాళీ బుడదయ్యాయి. పాతకాలపు పెంకుటిలుగా ఉన్న ఆ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది శంకర్, వినయ్ సంఘటన స్థలానికి చేరుకొని అప్రమత్తంగా వ్యవహరించి ఇంట్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు . గ్రామస్తుల సహాయంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకొని వారి సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ సిబ్బంది వ్య‌వ‌హ‌రించారు. గ్రామ‌స్తులు అభినందించారు.

Next Story