- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయి లిఖిత మృతి పై సమగ్ర విచారణ జరపాలి : పీడీఎస్ యూ
సాయి లిఖిత మృతి పై సమగ్ర విచారణ జరపాలని PDSU ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి శుక్రవారం వినతి పత్రం అందజేశారు.

దిశ, ఆర్మూర్ : సాయి లిఖిత మృతి పై సమగ్ర విచారణ జరపాలని PDSU ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ మాట్లాడుతూ విద్యార్థి పత్రాన్ని అందజేశారు. PDSU జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాయి లిఖిత గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న అక్కడ ఉన్న ఏఎన్ఎం ఇన్ చార్జి ప్రిన్సిపాల్, సిబ్బంది ఆ విద్యార్థిని పట్టించుకోకపోవడం వల్ల ఉదయం వాంటింగ్ చేసుకోవడం వల్ల అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం తెలపలేదన్నారు. మరుసటి రోజున ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైతే అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారన్నారు. నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అక్కడి నుంచి నిర్మల్ లోని స్వప్న సూపర్ స్పెషాలిటీ కు డాక్టర్లు అమ్మాయి కి డెంగ్యూ అని రిపోర్ట్ ఇచ్చారని, అక్కడి నుంచి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి వైద్యం చేయించి ఎందుకు తరలించారని అన్నారు. అక్కడ వైద్యం అందిస్తున్న అమ్మాయి గత నెల 17న ఉదయం 7:20 చనిపోయింది అని వైద్యులు చెప్పారని తెలిపారు. అమ్మాయి బాడీని పాఠశాల దగ్గరకి తీసుకొచ్చిన్న కనీసం అమ్మాయి చూడాలని వారు అన్నారు. దీనికి సంబంధించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, అమ్మాయి కుటుంబంలో ఒకరికి అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సాయి లిఖిత వాళ్ళ అన్న ఆయన ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలీ అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్ రాజు , విద్యార్థి తల్లిదండ్రులు లింగన్న లక్ష్మి , మామయ్య సాయినాథ్ పాల్గొన్నారు.






