పాములవాగు వంతెనపై ప్రయాణికుల నరకం!

by Elthuri vijay kumar |

కామారెడ్డి-ఎల్లారెడ్డి-నిజాంసాగర్ మార్గంలో ప్రయాణించే వారికి పాములవాగు వంతెన ఒక పెను శాపంగా మారింది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాముల వాగు వంతెన కొట్టుకుపోవడంతో అటువైపుగా ప్రయాణం సాగించే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

పాములవాగు వంతెనపై ప్రయాణికుల నరకం!
X

పాములవాగు వంతెనపై ప్రయాణికుల ఇక్కట్లు!

- సీఎం పర్యటించినా ఫలితం శూన్యం?

- బతకమ్మ పండుగ వేళ... కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే ప్రయాణికులకు నరకం

- వంతెన వరకే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.. ప్రైవేటు దోపిడీతో మరిన్ని కష్టాలు

దిశ,తాడ్వాయి: కామారెడ్డి-ఎల్లారెడ్డి-నిజాంసాగర్ మార్గంలో ప్రయాణించే వారికి పాములవాగు వంతెన ఒక పెను శాపంగా మారింది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాముల వాగు వంతెన కొట్టుకుపోవడంతో అటువైపుగా ప్రయాణం సాగించే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సెప్టెంబర్ 5న పాములవాగు వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రే పర్యవేక్షించిన తరువాత ఇక పనులు చకచక అవుతాయాని అందరు అనుకున్నారు.కానీ ఆ తర్వాత తాత్కాలికంగా ఆ బ్రిడ్జి పై మట్టి పోసిన వాటిపై నుండి ద్విచక్ర వాహనాలు,కార్లు, ఆటోలు,వెళ్లడానికి అవకాశం ఉంది.కానీ పనులు నత్తనడకన కొనసాగడంతో ఆర్టీసీ బస్సులు వెళ్లలేని పరిస్థితి ఉంది.దీంతో కామారెడ్డి నుండి ఎల్లారెడ్డికి వెళ్లాల్సిన బస్సులు లింగంపల్లి గ్రామం దగ్గర నిలిపి వేస్తున్నారు.ఫలితంగా,బతకమ్మ పండుగ వేళ కూడా తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ప్రైవేటు వాహనాల దోపిడీ

సాధారణంగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నిరాటంకంగా తిరిగేవి.కానీ వంతెన పనులు కారణంగా బస్సులను పోల్కంపేట్ రోడ్డు వరకే పరిమితం చేశారు.అక్కడి నుంచి లింగంపేట్,ఎల్లారెడ్డి, నిజాంసాగర్ కి వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడక తప్పడం లేదు.ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న ఆటోలు,ప్రైవేటు వాహనాలు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.సామాన్య ప్రజలు,విద్యార్థులు, వృద్ధులు ఈ దోపిడీకి బలవుతున్నారు.

ఎందుకు ఈ జాప్యం?

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కూడా పనుల్లో వేగం ఎందుకు పెరగడం లేదన్నది అటు వైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్ద ప్రశ్నగా మారింది.ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. కోటి మంజూరు చేసినా,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా?,లేక అధికారుల పర్యవేక్షణ లోపమా అన్నది మాత్రం తెలియడం లేదు.ఈ ఆలస్యం వల్ల బస్సులు ఆగిపోవడం ప్రయాణికులకు అనవసర ఖర్చులు,కష్టాలు తప్పడం లేదు.ఎప్పుడు ఈ బ్రిడ్జి పనులు పూర్తవుతాయి? ఎప్పుడు మా ప్రయాణ కష్టాలు తీరుతాయి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నిరీక్షణ ఈ వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

సీఎం సందర్శించినా ఇకట్లు తప్పవా? : బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాములవాగు వంతెన ను సందర్శించిన వాహనదారులకు ఇకట్లు తప్పవా? బతకమ్మ పండగ పూట కూడా నడిచి వెళ్లాలా? కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి కి ప్రయాణం చెయ్యాలంటే ఒక్క పాములవాగు వంతెన పనుల ఆలస్యానికి ప్రతిబింబం మారింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించినా,కోటి రూపాయలు మంజూరు చేసినా..లింగంపల్లి పాములవాగు బ్రిడ్జి ఇంకా నత్తనడకే కొనసాగుతుంది.

Next Story