బీఆర్ఎస్ ప్రకటనపై శ్రేణుల సంబరాలు

by Disha Web |
బీఆర్ఎస్ ప్రకటనపై శ్రేణుల సంబరాలు
X

దిశ, భిక్కనూరు : తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేస్తూ జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో పటాకులు కాలుస్తూ జై బీఆర్ఎస్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ జిందాబాద్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పి నర్సింహా రెడ్డి, అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి, వైస్ చైర్మన్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డి, సర్పంచ్ తునికి వేణు, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, సొసైటీ చైర్మన్ లు గంగల భూమయ్య, నాగర్తి భూంరెడ్డి, పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంబల్ల మల్లేశం, మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్, ఉప సర్పంచ్ బోడ నరేష్, తక్కళ్ళ మధు, వెంకట్ రెడ్డి, సంజీవరెడ్డి, ముదాం సత్తయ్య, మద్దూరి నర్సింలు, బైండ్ల భూపతి, తాటికొండ బాబు, గొల్లపల్లి అనంత్ గౌడు, పున్న గంగయ్య, ఏలేటి మోహన్ రెడ్డి, గడ్డమీది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed