- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన పంచాయితీ రాజ్ శాఖ అధికారి
ఆర్మూర్ ప్రాంతంలో భక్తి పారవశ్యంతో ఎన్నో పూజలు నిర్వహిస్తూ, ప్రజల్లో అశేష ప్రజాదారణ పొందిన పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ (నగేష్) శర్మ 7వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డారు.

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ ప్రాంతంలో భక్తి పారవశ్యంతో ఎన్నో పూజలు నిర్వహిస్తూ, ప్రజల్లో అశేష ప్రజాదారణ పొందిన పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ (నగేష్) శర్మ 7వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో ఒక కాంట్రాక్టర్ వద్ద 7వేల రూపాయల లంచం తీసుకొనే సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సిసి రోడ్డు పనుల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్ కు 4 లక్షల 75 వేల రూపాయల సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో పీఆర్ ఉద్యోగి రూ. 7500 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా 7వేల రూపాయలు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు అధికారుల సూచనలకు డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసిబి అధికారుల దాడులతో ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎసిబి అధికారులకు ఉన్న నిబంధనలు మేరకు సదరు కాంట్రాక్టర్ పేరును వెల్లడించబోమని డిఎస్పి చెప్పారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డిఎస్పి తెలిపారు. ఆయనతో పాటు ఏసీబీ దాడుల్లో నిజామాబాద్ ఏసీబీ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.






