సీఎం, పీసీసీ చీఫ్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం

by Ratna Kumari |

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క్యాబినెట్ స‌మావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్య‌వ‌సాయ క‌ళాశాల మంజూరు చేసిన సంద‌ర్భంగా క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల

సీఎం, పీసీసీ చీఫ్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క్యాబినెట్ స‌మావేశంలో నిజామాబాద్ జిల్లాకు వ్య‌వ‌సాయ క‌ళాశాల మంజూరు చేసిన సంద‌ర్భంగా క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు సుంకెట ర‌వి ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుంకెట రవి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంతకు ముందు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం నిజామాబాద్ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సల్లూరి గణేష్, గుడిసె అంజమ్మ, నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, గోపిడి లింగారెడ్డి, నరేందర్, శైలేందర్, సింగిరెడ్డి, శేఖర్, కొమ్ముల రవీందర్, నాగరాజు, వేములవాడ జగదీష్, దులూర్ కిషన్ పాల్గొన్నారు.

Next Story