- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల స్కాం
నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల విషయంలో పెద్ద స్కాం నడుస్తున్నట్లు అనుమాన్నాలున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల విషయంలో పెద్ద స్కాం నడుస్తున్నట్లు అనుమాన్నాలున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శనివారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ఈ అంశంపై మాట్లాడారు. దీనిపై కచ్చితంగా పూర్తి వివరణ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే ధన్ పాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాల తరవాత అతిపెద్ద నగరం నిజామాబాద్ నగరం అన్నారు. కార్పొరేషన్ లో రెవెన్యూ పెంచుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్పొరేషన్ లో ఇప్పటికే ఇంకా రూ. 100 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తుందని ఆయనన్నారు. కొన్ని ప్రాంతాల్లో పన్నుల్లో చాలా తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశానికి ముందు, ఒక అవగాహన సమావేశం నిర్వహిస్తే బాగుండేదని ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రధానంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి కార్పొరేటర్లు అంటే విలువే లేకుండా పోయిందన్నారు. ఇది చాలా విచారించ దగ్గ విషయం అన్నారు. ఏదైనా సమస్యలపైన, దరఖాస్తులపైన సంప్రదిస్తే సరిగా స్పందించడం లేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో సుందరీకరణ బాగా జరుగుతోందని, కానీ నిజామాబాద్ లో మాత్రం అది జరగడం లేదన్నారు. ప్రధానంగా బడ్జెట్, ఖర్చుల్లో తేడా ఉందని వాటిని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొత్తం రూ. 30 కోట్లు అంటే ప్రతి డివిజన్ కు రూ.50 లక్షల నిధులు ఉంటాయన్నారు, కానీ అవి ఖర్చు కావడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రటరీ మఠం పవన్ పాల్గొన్నారు.






