విద్యుత్ స‌మ‌స్య‌లు తీర్చ‌డ‌మే మా క‌ర్త‌వ్యం : ఏఈ పృథ్వీధ‌ర్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

విద్యుత్ స‌మ‌స్య‌లు తీర్చ‌డ‌మే మా క‌ర్త‌వ్యం అని సెస్ ఏఈ పృథ్వీధ‌ర్ గౌడ్ పేర్కొన్నారు.

విద్యుత్ స‌మ‌స్య‌లు తీర్చ‌డ‌మే మా క‌ర్త‌వ్యం :  ఏఈ పృథ్వీధ‌ర్ గౌడ్
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : విద్యుత్ స‌మ‌స్య‌లు తీర్చ‌డ‌మే మా క‌ర్త‌వ్యం అని సెస్ ఏఈ పృథ్వీధ‌ర్ గౌడ్ పేర్కొన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండ‌లంలోని నారాయ‌ణ‌పూర్ గ్రామంలో మంగ‌ళ‌వారం ప్ర‌జాబాట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. గ్రామంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను సెస్ ఏఈ బుర్ర పృథ్వీధ‌ర్ గౌడ్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించి ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ స్థంబాలు లేక‌పోవ‌డంతో ఆ ప్రాంతంలోని వారు ఒక విద్యుత్ మీట‌ర్ కి డ‌బ్బులు చెల్లిస్తే.. అక్క‌డి వర‌కు విద్యుత్ లైన్ స‌మ‌కూరుస్తామ‌ని తెలిపారు. ఈ డ‌బ్బులు మీ సేవా సెంట‌ర్ వ‌ద్ద ఆన్ లైన్ లో చెల్లించాల‌ని సూచించారు. గ్రామంలో లో వోల్టేజీ స‌మ‌స్య తీర్చ‌డానికి ట్రాన్స్ ఫార్మ‌ర్ అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. కొన్ని వార్డుల్లో విద్యుత్ స్తంభాలు అవ‌స‌ర‌మ‌ని నారాయ‌ణ‌పూర్ స‌ర్పంచ్ న‌ర్స‌య్య విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్ర‌జా బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఎస్ఎస్ 15 విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ ఆధునీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, లైన్ ఇన్ స్పెక్ట‌ర్ రమేష్, లైన్ మెన్ ప్రవీణ్, విద్యుత్ సిబ్బంది, నాయకులు గోగుర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story