బీసీలకు న్యాయం చేయడమే మా లక్ష్యం : శివన్నోల్ల శివకుమార్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఏర్గట్ల : తెలంగాణలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ అన్నారు. బీసీలకు

బీసీలకు న్యాయం చేయడమే మా లక్ష్యం : శివన్నోల్ల శివకుమార్
X

దిశ, ఏర్గట్ల : తెలంగాణలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ అన్నారు. బీసీలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ సిఫారసుల మేరకు 27 శాతం రిజర్వేషన్ కల్పించగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 23 శాతానికి తగ్గించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ఆమోదించి, గవర్నర్‌, కేంద్రానికి పంపిందని, కానీ కేంద్రం ఆమోదించకపోవడం వల్ల బిల్లు పెండింగ్‌లో ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. బీసీల హక్కు కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలిచే పార్టీలను ప్రజలు తప్పక బహిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, దండేవోయిన సాయికుమార్, మెరుగు సురేష్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story