ఆపరేషన్ సిందూర్ సైనికుడు మున్యా నాయక్ సేవా భవిష్యత్ తరాలకు ఆదర్శం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగిరెడ్డిపేట్ (ఎల్లారెడ్డి) : ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని దేశ సేవలో తన బాధ్యతను నిలబెట్టుకుంటున్న సైనికుడు మున్యా నాయక్ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచాడని కాంగ్రెస్ పార్టీ

ఆపరేషన్ సిందూర్ సైనికుడు మున్యా నాయక్ సేవా భవిష్యత్ తరాలకు ఆదర్శం
X

దిశ, నాగిరెడ్డిపేట్ (ఎల్లారెడ్డి) : ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని దేశ సేవలో తన బాధ్యతను నిలబెట్టుకుంటున్న సైనికుడు మున్యా నాయక్ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచాడని కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ఎక్కపల్లి తాండా కు చెందిన భారత భద్రత దళాలకు చెందిన ఆపరేషన్ సింధూర్ సైనికుడు మున్యానాయక్ ను కురుమ సాయిబాబా ఎల్లారెడ్డిలో శాలువా కప్పి ఘనంగా సన్మానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికుడు మున్యా నాయక్ దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించి తీవ్రవాదులతో చేసిన పోరాట పటిమ ఎంతో అభినందనీయమని, అతని సేవా భావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story