ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..

by Bhanu |

ఆన్ లైన్ బెట్టింగ్ తో మరో యువకుడు బలి అయ్యాడు.

ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..
X

దిశ, బాన్సువాడ : ఆన్ లైన్ బెట్టింగ్ తో మరో యువకుడు బలి అయ్యాడు. నిజాంబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయగూరు గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) ఆన్లైన్ గేమ్స్ కు బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు. తండ్రి ఫోన్ నుండి 5000/₹ ఐదు వేలు తీసుకొని బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయినా బాధతో మంగళ వారం రాత్రి గ్రామంలోని శివారులో పాడుబడ్డ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మాగిరి పోశెట్టి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ.సాయన్న తెలిపారు. తనకు వ్యవసాయం పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే కొడుకు చేతికి వచ్చిన వాడు చనిపోవడంతో తండ్రి కన్నీరు మున్నిరయ్యాడు.



Next Story