- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే భవనం.. నాలుగు గదులు..మూడు పాఠశాలలు..!
దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో వీక్లీ మార్కెట్, ఫిర్దోస్ కాలనీలలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో వీక్లీ మార్కెట్, ఫిర్దోస్ కాలనీలలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో మూడేళ్ల కిందట అధికారులు పక్కనే ఇస్తాంపుర యూపీఎస్ నాలుగు గదులతో కొనసాగుతున్నటువంటి పాఠశాలలో ఈ రెండు పాఠశాలలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం మూడు పాఠశాలలు కూడా ఒకే భవనంలో ఉండటం.. అందులో కేవలం నాలుగు గదులు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో ఒకే గదిలో మూడు తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మూడు పాఠశాలలు అక్కడే వండటంతో చదువు ఎలా కొనసాగుతుందని విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అర్పాత్ కాలనీలో స్థలంతో పాటు పాఠశాల భవనం కోసం రూ.20లక్షల నిధులు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ పాఠశాల ఫౌండేషన్ బేస్ మెంట్ వరకు ప్రారంభించి.. అక్కడితే ఆపేశాడు. ఒక బిల్లు వచ్చినప్పటికీ తీసుకోకుండా పనులు నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అయినప్పటికీ పనులు కొనసాగకుండా.. ఒకే భవనంలో మూడు పాఠశాలల విద్యార్థులను కొనసాగిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మా పిల్లల భవిష్యత్ ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మాజీ వార్డు మెంబర్ షేక్ అక్బర్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని కోరారు. సబ్ కలెక్టర్ ని కలిసిన వారిలో షేక్ అక్బర్, ఖాదర్, ఇర్ఫాన్ ఖాన్ ఉన్నారు.






