అధికారులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి : స‌బ్ క‌లెక్ట‌ర్ అభిగ్యాన్ మాళ‌వీయ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ శుక్రవారం పర్యటించారు. భూభారతి రికార్డులు, రెవెన్యూ శాఖ రికార్డులు, సిబ్బంది హాజరు పుస్తకాలు, పౌర సేవల పరిష్కార

అధికారులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాలి : స‌బ్ క‌లెక్ట‌ర్ అభిగ్యాన్ మాళ‌వీయ
X

దిశ‌, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయ శుక్రవారం పర్యటించారు. భూభారతి రికార్డులు, రెవెన్యూ శాఖ రికార్డులు, సిబ్బంది హాజరు పుస్తకాలు, పౌర సేవల పరిష్కార స్థితిని ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, ప్రతి అంశాన్ని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. సర్టిఫికేట్‌లు, పాస్‌బుక్స్ వంటి సేవలను తక్షణమే క్లియర్ చేయాలని తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.అలాగే గ్రామ జీపీఓలు ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా ఉండాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సబ్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఆర్ఐ అరవింద్, ఏఆర్ఐ రేణుక, జీపీఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story