- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫారెస్ట్ అధికారులకు అవగాహన
మండల కేంద్రంలోని రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో శనివారం ఫారెస్ట్ అధికారులకు రిజర్వ్ ఫారెస్ట్ లోపల, వెలుపల టైగర్ కదలికలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి పూణేలోని టైగర్ రెస్క్యూ టీం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్లు అవగాహన కల్పించారు.

దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని రేంజ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో శనివారం ఫారెస్ట్ అధికారులకు రిజర్వ్ ఫారెస్ట్ లోపల, వెలుపల టైగర్ కదలికలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి పూణేలోని టైగర్ రెస్క్యూ టీం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైగర్ కదలికలను ఎలా గుర్తించాలి, దాని స్థానాలను గుర్తించడం ద్వారా ట్రాప్ కెమెరాను ఎలా అమర్చాలి, టైగర్‌ను ఎలా ప్రశాంతపరచాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రదేశాలను గుర్తించి పగ్ మార్క్‌లను ఎలా గుర్తించాలి, పులి పశువులపై దాడి చేసినప్పుడు లేదా చంపినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ ముందు జాగ్రత్త చర్యల గురించి వివరించారు. రెస్క్యూ టీం గత ఆరు నెలల నుంచి దానిపై పని చేస్తున్నప్పుడు పులి ప్రవర్తన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవీందర్, కన్సర్న్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, కమ్మర్ పల్లి, సిరికొండ, ఇందల్వాయి రేంజ్‌ల బీట్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






