- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు : ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, నిజాంసాగర్ : కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు

దిశ, నిజాంసాగర్ : కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నేనావత్ కస్తూరి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన TSPSC పరీక్షల్లో గ్రేడ్ 1 ఉమెన్స్ డెవలప్మెంట్ & చిల్డ్రన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని సాధించారు. ఈ సందర్భంగా నేనావత్ కస్తూరిని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర శాలువా కప్పి పూలమాలలతో,మెమెంటో తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2024లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన కస్తూరి, విధుల్లో నిబద్ధతతో పాటు అభ్యాసాన్ని కొనసాగించి ఈ విజయాన్ని సాధించారన్నారు. ఆమె కృషి, పట్టుదల యువతకు ఆదర్శంగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.






