- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తర తెలంగాణ వట్టిపోతుంది : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ఉత్తర తెలంగాణ వట్టిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిధులు నిజామాబాద్ జిల్లాకు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

దిశ, ఆర్మూర్ : ఉత్తర తెలంగాణ వట్టిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిధులు నిజామాబాద్ జిల్లాకు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. నిండు సభలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రులు ఉన్నారని రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి రెండు సంవత్సరాల క్రితం లైనింగ్ పనుల కోసం 22 కోట్లు కేటాయించారని, ఆర్మూర్ లోని లంబాడి తండాల్లో నిజాం సాగర్ కాలువ పనుల కోసం 7 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, 2000లో మొరాయించిన మోటార్లకు ఇప్పటివరకు మరమ్మత్తులు చేపట్టడం లేదని కాలిపోయిన మోటార్ల స్థానాల్లో వేరే మోటార్లను ఫిట్టింగ్ చేయడం లేదని ఆర్మూర్ ప్రాంత రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సభాముఖంగా చెప్పారు.
ప్రాజెక్టులు కట్టడం మంచిదే..
లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టడం మంచిదే. కానీ దానిపై కూడా సభలో చర్చిద్దాం అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం హయాంలో స్వాతంత్రం రాకముందు నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారని ఆ నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మెయిన్ కెనాల్స్ ఇతర పిల్ల కాలువలు మరమ్మత్తులు చేయక సగం పూడికతో నిండిపోయి, నాశనం అయ్యాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు 22 వేల కోట్లను కేటాయించి ఈ నిజాంసాగర్ కాలువల అభివృద్ధి చేయించాలని, పూడిపోయిన నిజాంసాగర్ కాలువలకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 89 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 21 వేల కోట్లతో చాలని సందర్భంలో ఇంకా 56 వేల కోట్లతో దక్షిణ తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టడం మంచిదే అన్నారు. రెండు సంవత్సరాల క్రితం శ్రీరాంసాగర్ కు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ఆర్మూర్ లో నిజాంసాగర్ కాలువల మోటార్ల మరమ్మత్తుల కోసం 15 వేల కోట్లను, 22 వేల కోట్లను మంజూరు చేయించాలని కలవడం జరిగిందని, దీనిపై మంత్రి సంతకం పెట్టారని ఆ ఫైలు ఇంతవరకు ముంగటికి జరగలేదని అసెంబ్లీ సాక్షిగా పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయంపై ప్రజలు ఆధారపడతారని, గల్ఫ్ దేశాలకు సైతం వెళ్లి ఉపాధి పొందే ప్రజలు చాలానే ఉన్నారని అన్నారు.
సగం మందికి ఇళ్లు.. సగం మందికి ఇళ్ల స్థలాలు..!
ఆర్మూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో 3500 లలో సగం మందికి ఇందిరమ్మ ఇళ్లను సగం మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 90 గ్రామాలు ఉన్నాయని ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని గుర్తించాలన్నారు. పేదోడికి పార్టీలు ఎక్కడ ఉంటాయని, పార్టీలను అంకచూపి పేదవారికి అన్యాయం చేయవద్దు అన్నారు. ఈ విషయంలో మా జిల్లా ఇన్చార్జి మంత్రి ధన సూరి అనసూయ సీతక్క కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మంత్రి సీతక్క దృష్టికి పార్టీలను చూపుతూ అర్హులను ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారని సూచించగా, మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి నిరుపేదలకు న్యాయం చేసే నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పార్టీలను చూడవద్దని ప్రతి పేదోడికి ప్రభుత్వ పథకం అందేలా అధికారులు చూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.






