- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పని చేయని ట్రాఫిక్ సిగ్నల్స్.. ఇబ్బందుల్లో వాహన చోదకులు
దిశ, నిజామాబాద్ అర్భన్ : వాహనాలు, ప్రజల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్వవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దిశ, నిజామాబాద్ అర్భన్ : వాహనాలు, ప్రజల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్వవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రధాన కూడళ్లలో అస్తవ్యస్థ ట్రాఫిక్ ను గాడిలో పెట్టేందుకు కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. ఈ వ్యవస్థ సరిగ్గా పని చేస్తేనే రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉంటుంది. కొద్ది సేపు సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోతే ట్రాఫిక్ మొత్తం ఆగమాగమైపోతుంది. రోడ్డు ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి రోడ్డు క్రాస్ చేసే వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడమో, పాదచారులను ఢీకొట్టడమో వంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటిది నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడలి కంఠేశ్వర్ ప్రాంతంలోని డీఎస్ సర్కిల్ లోని ట్రాఫిక్ లైట్లు కొద్ది రోజులుగా వెలగడం లేదు. వాటి మరమ్మతులపై కూడా అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ లైట్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలని వాహన చోదకులు కోరుతున్నారు.






