- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్గాపూర్‌లో ఐస్‌క్రీమ్ బండ్లకు నో ఎంట్రీ..!
కామారెడ్డి జిల్లా పరిధిలోని మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామ సర్పంచ్ వెల్లుట్ల మేఘన నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా పరిధిలోని మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామ సర్పంచ్ వెల్లుట్ల మేఘన నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తెల్గాపూర్ గ్రామంలో ఐస్‌క్రీమ్ ఆటోలు, ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఫ్లెక్సీ రూపంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో అనధికారికంగా తిరుగుతూ వ్యాపారం నిర్వహించడం వల్ల పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని, చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గ్రామ శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఫ్లెక్సీలో స్పష్టంగా పేర్కొన్నట్లు, ఈ నిబంధనలను ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్‌క్రీమ్ విక్రేతలు ప్రవేశిస్తే.. రూ. 5000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. గ్రామ ప్రజలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ, గ్రామంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






