ప్రభుత్వ ఆసుపత్రి వైద్యకళాశాలను తనిఖీ చేసిన ఎన్ఎంసీ బృందం..

by Disha Web Desk 20 |
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యకళాశాలను తనిఖీ చేసిన ఎన్ఎంసీ బృందం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, అనుబంధ జనరల్ ఆసుపత్రిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీ చేసింది. మంగళవారం ఉదయం నేషనల్ మెడికల్ కమిషన్ బృందంలోని డా. ఐవాచటర్జీ, డా. రాజ్ కుమార్ రాథోడ్ లు ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగం, ఫార్మాకాలజీ విభాగాలను సందర్శించారు. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

అలాగే ఆయావిభాగాలలోని వైద్యుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీలో ప్రస్తుతం ఉన్న ఫార్మాకాలజీ మూడు సీట్లను పెంచడానికి, కొత్తగా పల్మనారి విభాగంలో సీట్లను కేటాయించడానికి ఈ తనిఖీలను నిర్వహించారు. ఎన్ఎంసీ బృందం నివేదిక ఆధారంగా కొత్తగా పీజీ సీట్ల కేటాయింపు జరగనుంది. వారి వెంట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ లు ఉన్నారు.



Next Story

Most Viewed