నిజాంసాగర్ 16 గేట్లు ఎత్తివేత

by velandi.Saikiran |

నిజాంసాగర్ 16 గేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద =

నిజాంసాగర్ 16 గేట్లు ఎత్తివేత
X

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ 16 గేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దింతో బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు 16 వరద గేట్లను ఎత్తి దిగువకు 1,52,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 92,626 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.00 అడుగుల (16.357 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు 16 వరద గేట్లును ఎత్తివేసి 1, 52,848 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదిలిపెడుతున్నట్లు ఏఈ తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వర్ధనీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు రైతులు పశువుల గొర్రెల కాపరులు మంజీరా వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు.

Next Story