- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత కలెక్టరేట్ లోకి మారిన నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం
by Batti.Sumithra |
నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్ భవనంలోకి మారింది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్ లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి.
దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఆర్డీఓ రవి, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






