- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు రోజుల వరకు నిజామాబాద్ మార్కెట్ యార్డు బంద్
ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఈనెల 18 నుంచి ఈనెల 22 వరకు నిజామాబాద్ లోని మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో ఈనెల 18 నుంచి ఈనెల 22 వరకు నిజామాబాద్ లోని మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించారు. ఐదు రోజుల పాటు మార్కెట్ యార్డులో ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు వంటి కార్యకలాపాలేవీ జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. తిరిగి ఈనెల 23 (సోమవారం) నుంచి మార్కెట్ యార్డులో వ్యాపార కార్యకలాపములు యదావిధిగా నిర్వహించబడతాయని సెక్రటరీ తెలిపారు.
వ్యాపారుల సిండికేట్.. పసుపు ధరల తగ్గుదల వార్తల్లో వాస్తవం లేదు
ఇరాన్ / అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా పసుపు ధరలు తగ్గుతున్నాయని, మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ గా మారి కావాలనే పసుపు ధరలు తగ్గిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని సెక్రటరీ తెలిపారు. ఈ వార్తలన్నీ నిరాధారమైనవని ఆమె అన్నారు.
వర్షాల కారణంగా ధరలు తగ్గుతాయేమోనని భయంతోనే
అకాల వర్షాల కారణంగా పసుపు ధరలు మరింత తగ్గుతాయేమోనన్న భయంతో రైతు సోదరులు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున పచ్చి పసుపు తీసుకరావడంతో పసుపు మోడల్ ధరలో రూ. 500 ల నుండి రూ. 800 ల వరకు తగ్గుదల గమనించినట్లు సెక్రటరీ అపర్ణ తెలిపారు. మార్కెట్ యార్డునందు పసుపు ధరల క్షీణతను నివారించడానికి, పచ్చి పసుపు అమ్మకమును నివారించుటకు మార్కెట్ యార్డులో ఈనెల 23 నుండి గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయనున్నట్లు ఆమె తెలిపారు.
పూర్తిగా ఎండబెట్టిన పసుపునే మార్కెట్ కు తేవాలి
పసుపునకు గిట్టుబాటు ధర రావాలంటే పూర్తిగా ఎండబెట్టిన పసుపును మాత్రమే అమ్మకానికి మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సెక్రటరీ అపర్ణ పసుపు రైతులను కోరారు. గ్రేడింగ్ లో పాసైన పసుపు కుప్పలకు మాత్రమే లాట్ నెంబర్లు జారీచేయబడతాయన్నారు. రైతుసోదరులు ఎట్‌టి పరిస్థితుల్లో పచ్చి పసుపును మార్కెట్ యార్డునకు తీసుకరావద్దని సెక్రటరీ అపర్ణ రైతులను కోరారు. ఈనెల 18, 19 , 20 21 తేదీల్లో మార్కెట్ యార్డుకు సెలవులని, ఈనెల 22 న శనివారం రంజాన్ కారణంగా మార్కెట్ యార్డునందు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబడవని ఆమె తెలిపారు. మార్‌కెట్ యార్డులో తిరిగి ఈనెల 23 నుండి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబడతాయని, రైతులు గమనించాలని ఆమె కోరారు.






