- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి పోలీసులపై సీపీ ఉక్కుపాదం: నిజామాబాద్‌లో హడల్
విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బంది పట్ల సీపీ సాయిచైతన్య కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాలనలో మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు చర్యలు చేపట్టారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బంది పట్ల సీపీ సాయిచైతన్య కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాలనలో మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా ఉద్యోగుల పనితీరు మెరుగుదలకు చర్యలు చేపట్టారు. శాఖా పరంగా అప్పగించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా తనదైన పనితీరుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా సీపీ సాయిచైతన్య పూనుకున్నారు. అలవాటైన ప్రాణం.. నిలకడగా ఉండదు.. ఏ సార్ వస్తే ఏంటి.. మన పని మనం గుట్టు సప్పుడు గాకుండా చేసుకుంటా పోవాలే అనే మైండ్ సెట్ తో అవినీతి జేసేటోళ్ల పని పట్టేందుకు పోలీస్ బాస్ పక్కాగా కాపుగాసుకుని కూసున్నడు.. కంప్లయింట్ అందితే చాలు.. ఎంక్వైరీ జేసుడు.. వేటేసుడు.. లేదంటే బదిలీ జేసుడు.. ఇది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య రియాక్షన్ కు పోలీసు శాఖ దడుసుకుంటుంది. అవినీతి, అక్రమాలతో మైలవట్టిన శాఖను ప్రక్షాళన చేసేందుకు పోలీస్ బాస్ నడుంబిగించారు. పోలీస్ శాఖలో అవినీతిని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని సంకేతాలిస్తున్నారు.
అధికారులు, సిబ్బంది పని వేళలు తప్పక పాటించేలా పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ నెల 1, 2 తేదీల్లో వరుసగా ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వేటు వేసిన సీపీ సాయి చైతన్య తాజాగా ఏకంగా ట్రాఫిక్ ఏసీపీ టి.నారాయణ పైనే చర్య తీసుకున్నారు. ఆయనను డీజీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీటీసీ లో ఉన్న మస్తాన్ వలీకి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ గా బాధ్యతలు అప్పగించడంతో పోలీస్ శాఖలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల వ్యవధిలోనే సీపీ పోలీసు శాఖలో కలుపు మొక్కలను ఏరివేసి చర్యలు ప్రారంభించడంపై పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో చర్చించుకుంటున్నారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ పై అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడం, ఆయన అవినీతిపై సీపీ సమగ్రంగా విచారణ జరిపించడం, అవినీతి ఆరోపణల్లో నిజాలున్నాయని తేలడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. అంతకు ముందు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్మీలో ఉద్యోగాలిప్పిస్తానని అమాయకుల నుండి రూ.లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలిప్పించకపోగా తిరిగి డబ్బులడిగిన వారిని బెదిరింపులకు పాల్పడటం చేసిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. కోర్టు డ్యూటీలు చేసే కానిస్టేబుల్ కూడా కోర్టు కేసుల విషయంలో అవినీతికి పాల్పడుతున్నాడని పెద్ద యెత్తున ఆరోపణలు రాగా విచారణ జరిపించి ఆయనపై కూడా సస్పెన్షన్ వేటు వేసి చర్యలు తీసుకున్నారు. తాజాగా ట్రాఫిక్ ఏసీపీ నారాయణ పై వేటు వేశారు. తప్పు చేస్తే సొంత శాఖకు చెందిన వారినైనా ఉపేక్షించేది లేదని సీపీ సాయిచైతన్య చాలా బలమైన మెసేజ్ ఇస్తున్నారు. తాజాగా వేటు పడిని ట్రాఫిక్ ఏసీపీ నారాయణపై ఎన్నో రకాల ఆరోపణలున్నాయి. వ్యాపారుల నుండి ముడుపులు దండుకోవడంతో పాటు భారీ వాహనాలను నగరంలో నుండి అనుమతించడానికి కూడా వారి నుండి పెద్ద యెత్తున ముడుపులు దండుకున్నారని అనేక ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. వీటన్నింటిపై విచారణ జరిపించిన సీపీ తన వద్దకు చేరిన నివేదికతో వెంటనే చర్యలకు పూనుకున్నారు.
జిల్లాలో సగం పోలీస్ స్టేషన్‌లపై ఫిర్యాదులే..
జిల్లా వ్యాప్తంగా 46 పోలీస్ స్టేషన్లున్నాయి. వీటిలో దాదాపు 20 పోలీస్ స్టేషన్లపై శాఖాపరమైన ఫిర్యాదులు సీపీ కి చేరినట్లు తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచి విభాగంలోని వారిచేత సీపీ పోలీసుల అవినీతిపై లోతుగా విచారణ చేస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై తనకందిన ఫిర్యాదులపై సీపీ సాయిచైతన్య ఏ అంశాన్ని వదలకుండా చాలా లోతైన విచారణ చేస్తున్నారు.స్పెషల్ బ్రాంచి పోలీసులతో జరిపించిన విచారణలో దోషిగా తేలితే జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, మొరం, నల్లమట్టి దందాల విషయంలో ఇసుక రీచ్ లు, మంజీర నదీపరివాహక ప్రాంతాలకు చెందిన వారు ఇసుక, మొరం మాఫియాల ద్వారా చాలా పెద్ద యెత్తున ముడుపులు దండుకుంటున్నారని సీపీ కి పక్కా ఆధారాలతో విచారణ నివేదికలు అందినట్లు సమాచారం. త్వరలోనే మరి కొందరిపై సీపీ చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎస్ఐ లు తమ కింది స్థాయి కానిస్టేబుల్స్ తో గుట్టు చప్పుడు కాకుండా జరుపుతున్న అవినీతి బాగోతంపై కూడా విచారణలు జరిపిస్తున్నారని తెలుస్తోంది. వారం రోజుల్లో మరి కొందరిపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.
సొంత శాఖలోనే అవినీతిని అరికట్టకుంటే..
తన సొంత శాఖలోనే అవినీతిని అరికట్టకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదముందని భావిస్తున్న సీపీ ముందుగా పోలీసు శాఖలో పూర్తి ప్రక్షాళనపై దృష్టి సారించారు. గడిచిన ఐదు రోజుల్లోనే ముగ్గురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో అవినీతి పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆర్మూర్ డివిజన్ లోని ఓ రెండు పోలీస్ స్టేషన్లపై పోలీస్ బాస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా అక్కడి సిబ్బందిపై వేటు పడొచ్చనే టాక్ పోలీసు శాఖలో వినిపిస్తోంది. ఓ పక్క పేకాటను పూర్తిగా నియంత్రించాలనే ఉద్దేశంతో పేకాట స్థావరాలపై రైడ్ చేస్తూ కేసులు నమోదు చేయిస్తుంటే, కొందరు ఎస్ ఐ






