Amit Shah : పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ : అమిత్ షా

by Muthe.Rajitha |

నిజామాబాద్(Nizamabad) లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(Turmeric Board office) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రారంభించారు.

Amit Shah : పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ : అమిత్ షా
X

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్(Nizamabad) లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(Turmeric Board office) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రారంభించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను పరిశీలించిన అమిత్ షా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ అని పేర్కొన్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు నేడు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలోని పసుపు రైతులందరికీ తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్‌ పసుపు వెళ్తుందని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story