- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రౌడీయిజం ఫ్రీ సిటీగా నిజామాబాద్.. సెటిల్మెంట్లపై సీపీ కన్నెర్ర
నిజామాబాద్ నగరం ఇటీవల రౌడీయిజం, మర్డర్‌లు, నైఫ్ కల్చర్ వంటి దారుణాలకు అడ్డాగా మారింది. దీంతో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి.

దిశ నిజామాబాద్ : నిజామాబాద్ నగరం ఇటీవల రౌడీయిజం, మర్డర్‌లు, నైఫ్ కల్చర్ వంటి దారుణాలకు అడ్డాగా మారింది. దీంతో శాంతి భద్రతలు ప్రమాదంలో పడ్డాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సీపీ సాయి చైతన్య 'రౌడీయిజం ఫ్రీ సిటీ' లక్ష్యంగా యాక్షన్ ప్లాన్‌ను మొదలుపెట్టారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, నవీపేటలో మహిళ మొండెం ఘటనలు జిల్లాలో నేరాల తీవ్రతకు నిదర్శనంగా నిలిచాయి. రౌడీ షీటర్లు కోట్లాది రూపాయల భూ కబ్జాలు, సివిల్ మ్యాటర్లలో సెటిల్‌మెంట్లు చేస్తూ, గ్యాంగ్ వార్‌లు పెంచుతున్నారు. సీపీ ఆదేశాల మేరకు రౌడీషీటర్లు, సెటిల్‌మెంట్ దందాలు చేసే వారిని పిలిపించి కఠినంగా హెచ్చరించడం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు, నేరాలకు మూలకారణమైన గంజాయి అక్రమ రవాణాపై కూడా పోలీసులు దృష్టి సారించారు. సీపీ సీరియస్ చర్యలతో త్వరలోనే నిజామాబాద్‌లో పరిస్థితి నియంత్రణలోకి వచ్చి పీస్‌ఫుల్ వాతావరణం నెలకొంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ నగరం ఇటీవల రౌడీయిజం, మర్డర్‌లు, నైఫ్ కల్చర్ వంటి దారుణాలకు అడ్డాగా మారింది. లక్షలాది మంది నివసించే నగరంలో రౌడీయిజం, దాదాగిరి, సెటిల్‌మెంట్ మాఫియా వంటి అరాచక శక్తుల ఆగడాలు పెరగడంతో శాంతియుత వాతావరణం ప్రమాదంలో పడింది. జిల్లా కేంద్రంలో ఎప్పుడు ఎవరు కత్తి దూస్తారో తెలియని పరిస్థితులు, మహిళల భద్రతకు కరువైన పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల జరిగిన సీసీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య, నవీపేట్ మండలంలో తల లేని మహిళ మొండెం ఘటనలు నేరాల తీవ్రతను, నేరగాళ్ల రెచ్చిపోతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి.
సెటిల్మెంట్లు, దందాలతో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు..
గల్లీ రౌడీయిజంతో మొదలైన రౌడీషీటర్ల నెట్‌వర్క్ ఇప్పుడు కోట్లాది రూపాయల భూ కబ్జాలు, ఇతర సివిల్ మ్యాటర్లలో సెటిల్‌మెంట్లు చేసే స్థాయికి చేరింది. కొందరు రౌడీషీటర్లు, గ్యాంగ్ లీడర్లు అమాయకులను బెదిరించి, వివాదాస్పద భూముల పంచాయతీలో తలదూర్చి భారీ మొత్తంలో సెటిల్‌మెంట్ ఫీజు కింద వసూలు చేస్తున్నారు. సెటిల్‌మెంట్ల విషయంలో విభేదాల కారణంగా గ్యాంగ్ వార్‌లు, కమీషన్ల విషయంలో గొడవలు కూడా జోరందుకున్నాయి.
రౌడీమూకలు, సెటిల్మెంట్ బ్యాచ్‌లపై ఫోకస్..
నిజామాబాద్ జిల్లాలో రౌడీ మూకలు, సెటిల్‌మెంట్ బ్యాచ్‌లపై సీపీ సాయి చైతన్య సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు, సెటిల్‌మెంట్ దందాలు చేసే వారిని పిలిపించి పద్ధతులు మార్చుకోమని తీవ్రంగా హెచ్చరించారు. గత పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు పద్ధతులు మారాల్సిందేనని సీపీ రౌడీమూకలు, సెటిల్‌మెంట్ బ్యాచ్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై కూడా..
సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ గ్రామాల్లోని గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలపై దృష్టి సారించి కళ్లెం వేసింది. గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో అరాచకాలు సృష్టిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారనే సంకేతాలను వెలువరిస్తున్నారు. ఏర్గట్ల, వేల్పూర్ తదితర గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖలో అంతర్గత అవలక్షణాలపై కూడా సీపీ ఫోకస్ చేశారు.
నేరాలకు, దారుణాలకు గంజాయే కారణమా?
నేరాలకు, ఘోరాలకు గంజాయి ఓ పెద్ద కారణమని తెలుస్తోంది. గంజాయి వాడకం, సేవనం, అక్రమ రవాణాకు అడ్డాగా నిలిచిన నిజామాబాద్ జిల్లాలో నేరాలకు మూల కారణాలను వెతుక్కుంటూ వాటిపై కొరడా జులిపించేందుకు సీపీ సిద్ధమయ్యారని తెలుస్తోంది. సీపీ సీరియస్ యాక్షన్ ఇప్పటికే మొదలైంది. త్వరలోనే పరిస్థితి జిల్లాలో పూర్తిగా పోలీసు నియంత్రణలోకి వచ్చేలా ప్లాన్ చేశారని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో పీస్‌ఫుల్ నిజామాబాద్‌ను చూసే అవకాశం ఉందనే ఆశాభావాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు.






