తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంఘ‌ట‌న నిజామాబాద్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్

తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్ అయిన సంఘ‌ట‌న నిజామాబాద్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ -1, లక్ష్మీ నరసింహ అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతున్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు సీసీఎస్ బృందం దాడి జ‌రిపింది. ఈ దాడిలో 9 మంది పేకాట రాయుళ్ల‌ను అరెస్ట్ చేసింది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ లు సురేష్, సాయినాథ్, ఎస్ఐ గోవింద్ తమ సిబ్బందితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట స్థావరంలో 9 సెల్ ఫోన్లు, రూ. 49,250 లు నిందితుల వ‌ద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు తెలిపారు.

Next Story