ఆర్మూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో తొమ్మిది మందికి 90వేల జ‌రిమానా

by Nallavelli.Anjaneyulu |

ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్మెంట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పది మందిని పట్టుకున్నారు.

ఆర్మూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో తొమ్మిది మందికి 90వేల జ‌రిమానా
X

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్మూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ ఫోర్స్మెంట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పది మందిని పట్టుకున్నారు. వారిని ఆర్మూర్ కోర్టులో హాజరు పరచగా.. 9 మందికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 90000 జరిమానా, ఒక్కరికి 7 రోజుల జైలు శిక్షను ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి జేఎఫ్ సీఎం భవ్యశ్రీ విధించినట్టు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మంగళవారం తెలిపారు. ప్రజలు గమనించి చిన్నపిల్లలకు తమ యొక్క వాహనాలను డ్రైవింగ్ గురించి వాహనాలు ఇవ్వవద్దని, వాహనదారులు తమ వాహనాలకు మైనర్లకు ఇచ్చినట్టయితే వారి వాహనములను సీజ్ చేసి సంబంధిత కోర్టుకు సబ్మిట్ చేస్తామని,వాహన యజమానులకు, పిల్లల తల్లిదండ్రులకు భారీగా జరిమానాలు విధిస్తామని, తల్లిదండ్రులైన వాహన దారులకు మోటార్ వాహన నూతన చట్ట ప్రకారం.. భారీగా జరిమాణాలు, జైలు శిక్షలు పెంచినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.

Next Story