ఇండియన్ పెట్రోల్ బంక్ లో నయా మాయాజాలం.. రోజుకో కొత్త తరహా మోసం

by Disha Web Desk 20 |
ఇండియన్ పెట్రోల్ బంక్ లో నయా మాయాజాలం.. రోజుకో కొత్త తరహా మోసం
X

దిశ, తాడ్వాయి : పెట్రోల్ మంటతో ఓ పక్కన సామాన్యుడి నడ్డి విరుగుతుంది. మరో పక్క రోజు వారి సగటు ధరల పెంపుతో ఎప్పుడు ఎంత మేర ధరలు పెరుగుతుంటాయో అనే సగటు వాహనదారులు బేంబేలెతీస్తుంది. పెట్రోల్ బాంక్ నిర్వహకులు నయా మోసాలతో దోచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ ఇండియన్ పెట్రోల్ బంకులో నయా మోసాలతో వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. లీటర్ పెట్రోల్ పోయించుకున్నామని ధీమాగా ఉన్నామంటే అంతే సంగతులు.

వివరాల్లోకెళ్ళితే చిట్యాల గ్రామానికి చెందిన సుబ్బు అనే వ్యక్తికి చెందిన మోటార్ సైకిల్ మధ్యలో ఆగడంతో పెట్రోల్ పోయించుకునేందుకు తాడ్వాయిలోని శబరిమాత ఆలయ సమీపంలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఒక లీటర్ బాటిల్ లో రూ,100 పెట్రోల్ వేయగా 300 ఎంఎల్ తక్కువ రావడంతో ఒక్కసారిగా కంగుతిన్న వాహన దారుడు ఇదేమిటని పెట్రోల్ బంక్ సిబ్బందిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తిస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేసాడని వాహన దారుడు ఆవేదన వ్యక్తం చేసాడు. వాటర్ బాటిల్ లో పెట్రోల్ వేయడంతోనే ఈ తతంగం అంతా బయటపడిందని వాహనదారులు తెలిపారు.

ఇలా వాహన దారులు కస్టపడి పోగుచేసుకున్న డబ్బులను అప్పనంగా రోజుకో కొత్త తరహా మోసాలకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు పాల్పడుతూ వాహనదారులను బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడి బంక్ నిర్వాహకులు కోట్లకు పడగలెత్తుతుంటే పెట్రోల్ పోయించుకుంటున్న వాహనదారులు ఉన్నది అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న బంక్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని మరెప్పుడు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా తూనికలు కొలతల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించలని వాహనదారులు కోరుతున్నారు.


Next Story

Most Viewed