కన్నుల పండుగ గా నేపాల్ అమ్మాయి- తెలంగాణ అబ్బాయి వివాహ వేడుక

by Nallavelli.Anjaneyulu |

దిశ : నిజాంసాగర్ : దేశం కానీ దేశం లో మనసులు కలిసి, ప్రేమించుకొని నేపాల్ అమ్మాయి, మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ అబ్బాయిల వివాహం గురువారం

కన్నుల పండుగ గా నేపాల్ అమ్మాయి- తెలంగాణ అబ్బాయి వివాహ వేడుక
X

దిశ : నిజాంసాగర్ : దేశం కానీ దేశం లో మనసులు కలిసి, ప్రేమించుకొని నేపాల్ అమ్మాయి, మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ అబ్బాయిల వివాహం గురువారం భారతీయ సాంప్రదాయ పద్దతిలో కన్నుల పండుగ‌గా జరిగింది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు. అక్కడే తన ఆపీస్ లో పనిచేస్తున్న నేపాల్ యువతీ తో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు ఒప్పుకోవడంతో యువతీ యువకుడు ఇండియా కు వచ్చి గురువారం గ్రామంలో కన్నుల పండుగగా పెళ్లి వేడుక చేసుకున్నారు. వీరి వివాహానికి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు భారీగా హాజరై నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం.. పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉన్నదని పెళ్లి కూతురు సంతోషం వ్యక్తం చేశారు. తిరిగి నెల రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Next Story