అధికారుల నిర్ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్లాలంటే సర్కస్ ఫిట్లు చేయాల్సిందే. కొ

అధికారుల నిర్ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టం..!
X

దిశ, కామారెడ్డి : ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్లాలంటే సర్కస్ ఫిట్లు చేయాల్సిందే. కొద్దిపాటి వర్షం పడితే చాలు బస్టాండ్ లోకి వెళ్లాలన్నా, బస్టాండ్ నుంచి బయటకు రావాలన్నా అందరికీ సర్కస్ ఫిట్లు తెలిసి ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని నెలలుగా గుంతలు ఏర్పడినా వాటిని పూడ్చే నాథుడే లేడు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు సైతం ఆ గుంతల్లో నుంచి బస్సు వెళ్లేటప్పుడు కుదుపులకి అతలాకుతలం కావాల్సిందే. బస్టాండ్ లో కి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు గల దారుల్లో ఉన్న గుంతలను పూడ్చాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన డిపో మేనేజర్ అయినా స్పందించి ఈ గుంతలను పూడ్చివేయిస్తారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

నీటి గుంతలో పడిన మహిళా కానిస్టేబుల్..

ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్ ఆవరణంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. విధి నిర్వహణ లో భాగంగా బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న మహిళా కానిస్టేబుల్ గుంతలు కనిపించకపోవడంతో అందులో పడిపోయింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు ఆమెను పైకి లేపి అధికారుల తీరుపై మండిపడ్డారు.

Next Story