అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తింపు

by Naveena |   (  Updated:2025-07-20 14:00:18  IST  )

జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.

అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తింపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్

మార్చి 28: జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ ఎఫ్ బీ ఎస్) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్లలోపు ఉండాలని అన్నారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

Next Story